అందెశ్రీ గారి మృతికి సంతాపంగా ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సంతాప కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ముందుగా వారికి సంతాపం వ్యక్తం చేస్తూ 2 ని.లు విద్యార్థులు, ఉపాధ్యాయులు మౌనం పాటించారు. అనంతరం వారి చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ మాట్లాడుతూ ఆయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో జన్మించారని, సమాజంలోని విషయాలు, ప్రకృతిలోని విషయాలపైన ప్రజలను చైతన్యం చేయడానికి ఎన్నో పాటలు రాశారని, జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతం రచించి, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి ఇటీవల రూ.కోటి పురస్కారం అందుకున్నారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య, ఆయన కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట అని, 2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం వచ్చిందని, 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారని, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం అందుకున్న అందెశ్రీ
ఉదయం 7:25 గం.లకి గాంధీ ఆసుపత్రిలో అమరుడైనారని తెలియజేశారు. ఆయన మన నుంచి భౌతికంగా దూరమైనా ఆయన రచనలు, పాటలు మనల్ని నిత్యం చైతన్యం చేస్తాయని వారి స్పుర్థితో బాగా చదువుకుని, సమాజాన్ని అవగాహన చేసుకొని, భవిష్యత్తులో సమాజాభివృద్ధి కోసం కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.







0 comments:
Post a Comment