ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, సంగీత లు మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి జైలు జీవితం కూడా గడిపారని, స్వాతంత్య్ర భారత దేశంలో మొట్టమొదటి విద్యా శాఖ మంత్రిగా 11 సం.రాలు పని చేసి అందరికీ విద్యను అందించడానికి, విద్యా వ్యాప్తికి విశిష్ట సేవలు అందించారని వారి సేవలను కొనియాడారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. విద్య మనిషికి మూడో నేత్రం లాంటిది. ప్రతి వ్యక్తి విద్య ద్వారానే జ్ఞానాన్ని పొందుతాడని, వాస్తవాలను తెలుసుకోవడం, విషయ పరిజ్ఞానం, విలువలు, విజ్ఞానం వల్ల వ్యక్తిలోని అజ్ఞానం, మూఢనమ్మకాలు తొలగిపోయి పరిపూర్ణ వ్యక్తిగా మారుతారని, సమాజాన్ని సరైన విధంగా అవగాహన చేసుకొంటారని, జీవితంలో సౌకర్యవంతమైన గొప్ప స్థాయికి ఎదుగుతారని, సమాజంలో గౌరవం పొందుతారని తెలియజేశారు.







0 comments:
Post a Comment