Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Saturday, 21 December 2024

Parent Teacher Meeting at MPPS Uppununthala Boys on 21/12/2024

 ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం (PTM): 


ఈ రోజు ఉదయం 9:30 గం.లకు ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం (PTM) ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ర్ అద్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆహారోత్సవం నిర్వహించి పోషక విలువల గురించి చర్చించడం జరిగింది. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, చందన మేడం, సంగీత మేడం లు మాట్లాడుతూ పోషక విలువలు సమృద్ధిగా ఉన్న పాలు, పండ్లు, గుడ్లు, మాంసం, ఆకు కూరలు, కూరగాయలు, తృణ ధాన్యాలు లతో తయారు చేసిన ఆహార పదార్థాలు , మొలకెత్తిన గింజలు పిల్లలకు అందించాలని సూచించడం జరిగింది. పోషక విలువలు గల ఆహారం పిల్లలకు అందించడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని, ఏకాగ్రతతో బాగా చదువుకుంటారని విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించడం జరిగింది.

అనంతరం విద్యార్థులు తెచ్చిన ఆహా పదార్థాలను ప్రదర్శించడం జరిగింది.



Quiz Competition at MPPS Uppununthala Boys

 

విద్యార్దులకు క్విజ్ పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులుగా పెన్నులు అందించి అభినందించడం జరిగింది.

Friday, 20 December 2024

Word Meditation Day Programme at MPPS Uppununthala Boys

ఘనంగా ప్రపంచ ధ్యాన దినోత్సవం:


ఈ రోజు ఉదయం 9:30 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రపంచ ధ్యాన దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు ధ్యానం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళనలు తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, మంచి అలవాట్లు అలవడుతాయని, మనస్సును అదుపులో ఉండి ఏకాగ్రత ఏర్పడుతుందని తద్వారా చేసే పనిలో విజయం సాధిస్తారని, విద్యార్థులు చదివింది అర్థం చేసుకొని ప్రగతి సాధిస్తారని, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు. అందుకే ప్రతి ఒక్కరూ రోజు కొద్ది సమయం ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులతో ధ్యానం చేయించడం జరిగింది.

Thursday, 5 December 2024

Babasaheb Dr.B.R Ambedkar's 68th Death Anniversary Programme

బాలుర ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అంబేద్కర్ గారికి నివాళులు:







 
ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి అందరూ పూలతో నివాళులు అర్పించారు. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన లు మాట్లాడుతూ అంబేద్కర్ గారు చిన్నతనం నుండి ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదురైనా బాగా చదువుకుని కుల, లింగ వివక్షతలకు, బాల్య వివాహాలు, జోగిని వ్యవస్థ, అంటరానితనం, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారని, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని స్వాతంత్ర్యం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారని, రాజ్యాంగం ద్వారా కులాలకు , మతాలకు అతీతంగా బాలబాలికలు అందరూ అభివృద్ధి సాధించడానికి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ లు, అవకాశాలు, హక్కులు కల్పించారని వివరించారు. అంబేద్కర్ గారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చిత్ర లేఖనంలో ప్రతిభ కనబరిచిన లోకేష్, ప్రశాంత్, సైదులు, వరుణ్ తేజ్ లకు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకాలను బహుమతులుగా ఇచ్చి అభినందించడం జరిగింది.


Tuesday, 29 October 2024

Felicitation and Welcome to Megavath Srinu sir on the occasion of joining in our school

🌹💐🌹📖✍️డిఎస్సీ 2024 ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎంపికైన మెగావత్ శ్రీను సార్ మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో చేరిన సందర్భంగా శాలువాతో సన్మానించి, ఘనంగా స్వాగతం పలికి, హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు🌹💐🌹

 

Tuesday, 15 October 2024

Missile Man of the India Dr A.P.J Abdul Kalam's 93rd birth anniversary celebrations 2024 at MPPS Uppununthala Boys

ఘనంగా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా ఎ.పి.జె అబ్దుల్ కలాం గారి 93 జయంతి కార్యక్రమం:

ఈ రోజు మధ్యాహ్నం 3:30 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఎ.పి.జె అబ్దుల్ కలాం గారి 93 జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు వెంకటేష్ , చందన అబ్దుల్ కలాం గారు భారత దేశానికి చేసిన సేవలను గురించి విద్యార్థులకు వివరిస్తూ తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో పేద కుటుంబంలో జన్మించిన అతను కష్టపడి చదువుకొన్నాడు. వాళ్ళ నాన్న పడవ నడిపేవాడు కాని కుటుంబం గడవడం కృష్ణంగా ఉండేది దీనితో కలాం గారు చదువుకునేటప్పుడు పేపర్ బాయ్ గా పని చేసేవాడు, సాయంత్రం సమయాల్లో నదీ దగ్గరికి వెళ్ళి ఎగిరే పక్షులను బాగా పరిశీలించేవారు. బాగా చదువుకుని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి క్షిపణి శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతి గా భారత దేశానికి గొప్ప సేవలు అందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు కూడా లభించింది. విద్యార్థులు గొప్ప కలలు కనాలి వాటి సాకారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించేవారు. కలాం గారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Saturday, 21 September 2024

Parent Teacher Meeting for September 2024 at MPPS Uppununthala Boys

తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహణ:

ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. 

ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను ఈ సమావేశానికి ఆహ్వానించి, వారి పిల్లలు ఇంటి వద్ద ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, చందన మేడం లు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఈ సమావేశం ఉంటుందని, ప్రతి సారి ఒక విషయం పైన చర్చించడం జరుగుతుంది అని ఈ సారి జ్వరాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పోస్టర్ ను ప్రొజెక్టర్ బిగ్ స్క్రీన్ పైన  వివరిస్తూ 1. ఇంటి పక్కల నిలువ నీరు ఉండకుండా చూసుకోవాలని, 2. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, 3. శుభ్రమైన నీరు తాగాలని, 4. జ్వరం వచ్చిన వారు మాస్క్ ను ధరించాలని, 5. తేలికపాటి ఆహారం తీసుకోవాలని, 6. డాక్టర్ ను సంప్రదించాలని తగు జాగ్రత్తలు తీసుకోని విద్యార్థులు రోగాల భారిన పడకుండా చూసుకొని వారిని ఆరోగ్యంగా ఉంచుతూ క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని అప్పుడే విద్గయార్థులు బాగా చదువుకుంటారని తెలియజేయటం జరిగింది. అనంతరం విద్యార్థుల పనితీరును తరగతుల వారిగా విషయాల వారీగా ప్రదర్శింప చేయటం జరిగింది . ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను తల్అలిదండ్రులు భినందించారు. అభ్యాసనలో వెనుకబడిన విద్యార్థులకు ఉపాధ్యాయుల మరియు తల్లిదండ్రుల సహకారం అవసరం కాబట్టి వారిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి వారి ప్రగతికి కృషి చేయాలని కోరడం జరిగింది. ఇంగ్లీష్ లోని 26 అక్షరాల 44 శబ్దాలను నేర్చుకోవడానికి Jolly Phonics వారు రూపొందించిన విధానం లో సులభంగా చదవడం, రాయడం నేర్పడం జరుగుతుందని Jolly Phonics యాప్ ని మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయించాలని తల్లిదండ్రులను కోరడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించడం జరిగింది.

ఈ సమావేశంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ అరుణ లింగమయ్య గారు, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.