Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Tuesday, 29 August 2023

Telugu Language Day celebrations 2023 at PS Uppununthala Boys

💐అందరికీ తెలుసు భాషా దినోత్సవం శుభాకాంక్షలు 🌹






కవి గిడుగు రామమూర్తి జన్మ దినం సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు మాతృ భాష దినోత్సవం/తెలుగు భాష దినోత్సవాన్ని మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో విద్యార్థులకు పద్యాల పోటీ, గేయాల పోటీ నిర్వహించడం జరిగింది.ప్రతిభ కనబరిచి విజేతలు నిలిచిన ప్రవీణ, సిరి, తన్వి, అలేఖ్య, రాహుల్, తేజ శ్రీ లకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మన మాతృభాష తెలుగు గొప్పతనం గురించి మాట్లాడుతూ అమ్మ ఒళ్ళో ఉన్నప్పటి బాల్యం నుంచే మనం తెలుగును నేర్చుకోవడం జరుగుతుంది అని అందుకే మనకు మాతృభాష లోనే ఏ విషయాన్ని అయినా చాలా సులువుగా అవగాహన చేసుకుంటాము. ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు, మన సంస్కృతి, సాంప్రదాయాలు అన్ని మాతృ భాషతో అనుసంధానం అయి ఉంటాయి. కాబట్టి మాతృ భాషపై పట్టు సాధిస్తేనే ఇతర ఇంగ్లీష్, హిందీ వంటి భాషలను సులభంగా నేర్చుకోగలము. కాబట్టి విద్యార్థులు అందరూ తెలుగు పాఠ్య పుస్తకాలను, గ్రంథాలయంలోని పుస్తకాలను చదివి తెలుగు భాషలోని వ్యాకరణం, పద్యాలు, గేయాలు, పాటలు, నీతి కథలు, కవితలు చదివి తెలుగు భాషపై పట్టు సాధించాలి అని విద్యార్థులకు సూచించారు.

Thursday, 24 August 2023

Chandrayan-3 landing on moon has been shown to PS Uppununthala Boys students

Chandrayan-3 landing on moon has been shown to PS Uppununthala Boys students:


















🚀👌👍చంద్రయాన్-3 ల్యాండింగ్ ను విద్యార్థులకు ప్రొజెక్టర్ స్క్రీన్ పై చూపించడం జరిగింది అదేవిధంగా చంద్రయాన్-3 గురించి వివరించి, విద్యార్థులు అందరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి సూచించి, ISRO శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.🌹💐🌹👍

Saturday, 19 August 2023

Two computers donate to PS Uppununthala Boys by Emmadi Saidulu sir, Software Employee & Motamari Madhu sir, Professor, PU

 











తేది. 19-08-2023 ఉదయం 10 గం.లకు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం (Parent Teacher Meeting) లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారు, PU ప్రొఫెసర్ మోటమారి మధు గారు BPS ఉప్పునుంతల ప్రభుత్వ పాఠశాలకు 30వేల రూపాయలతో 2 కంప్యూటర్లను విరాళంగా అందజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు దాతలను ఘనంగా శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. కాంప్లెక్స్ హెచ్ఎం హన్మంతు రెడ్డి సార్, హెచ్ఎం లక్ష్మీ నారాయణ సార్, బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండే కంప్యూటర్ విద్యను నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. దాతలు సైదులు గారు, మధు గారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉపాధ్యాయులు అందిస్తున్నారని, అందుకే  పే బ్యాక్ టు ది సొసైటీ లో భాగంగా పాఠశాలకు కంప్యూటర్లను ఇస్తున్నామని, తాము కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ స్థాయికి చేరుకొన్నామని విద్యార్థులు కూడా విద్యను నిర్లక్ష్యం చేయకుండా భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.


ఈ సమావేశంలో సైదులు గారి శ్రీమతి భారతి గారు, పి.హెచ్.డి స్కాలర్ మహదేవ్ గారు, లక్ష్మణ్ గారు, శ్రీను గారు, మల్లేష్ గారు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Saturday, 5 August 2023

Spell Bee Competition at PS Uppununthala Boys

స్పెల్ బీ కాంపిటీషన్ నిర్వహణ:

 మొదటి బహుమతి విజేతలు: 











రెండవ బహుమతి విజేతలు:









ఈ రోజు మధ్యాహ్నం 3 గం.కు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మొదటి శనివారం సందర్భంగా విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై అవగాహన పెంపొందించడానికి విద్యార్థులను ఆరు గ్రూపు లుగా చేసి వారికి స్పెల్ బీ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతిభ కనబరిచిన గాజుల గౌతమ్ గ్రూప్ విద్యార్థులు మొదటి బహుమతి మరియు నడిగడ్డ కిరణ్ గ్రూప్ రెండవ బహుమతి పొందారు, వీరికి ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ అభినందనలు తెలియజేసి, పెన్నులు బహుమతిగా  ఇవ్వడం జరిగింది. మిగతా గ్రూపు విద్యార్థులు నిరాశ చెందకుండా తరువాత జరగబోయే కాంపిటీషన్ లో విజయం సాధించేలా చదువుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ స్పెల్ బీ కాంపిటీషన్ వల్ల విద్యార్థుల్లో ఇంగ్లీష్ పదజాలం అభివృద్ధి చెంది భాషపై అవగాహన పెరుగుతుంది అన్నారు. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఇంగ్లీష్ భాష ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంగ్లీష్ ని బాగా నేర్చుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Saturday, 10 June 2023

Pro Jayashankar Badibata Programme 2023-24 by PS Uppununthala Boys

 


💐🌹💐ఉప్పునుంతల గ్రామ ప్రజలకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం శుభాకాంక్షలు 🌹💐🌹

🤝⚡విద్యార్థుల తల్లిదండ్రులకు గొప్ప శుభవార్త⚡🤝

👉 ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను మన ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అందించబడును.

👉 గురుకుల ప్రవేశ ఫలితాల్లో 2019 సంవత్సరంలో 4; 2020 సంవత్సరంలో 3; 2021 సంవత్సరంలో 4; 2022 సంవత్సరంలో 8; 2023 సంవత్సరంలో 8, ఇలా ప్రతి సంవత్సరం సీట్లు సాధిస్తూ గత ఐదు సంవత్సరాల్లో మొత్తం 27 గురుకుల సీట్లు సాధించిన ఘనత మన పాఠశాలది.

👉 నాణ్యమైన విద్య పొందుతూ వినయంతో గురుకుల ప్రవేశాల్లో ఘన విజయం సాధిస్తున్న మన విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు🌹💐🌹.

🔥మన పాఠశాల ప్రత్యేకతలు🔥

👉 ఆహ్లాదకరమైన స్వేచ్ఛా వాతావరణంలో నిజ జీవిత సన్నివేశాలకు అన్వయిస్తూ ఆటపాటలతో బోధన.

👉 ఉన్నత విద్యావంతులు, విషయ నిపుణులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన.

👉 అన్ని తరగతులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన.

👉 తెలుగు, ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలు, గణిత సామర్థ్యాల అభివృద్ధి కోసం FLN ద్వారా విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధన.

👉 బట్టి విధానంలో కాకుండా విషయ అవగాహన కోసం CCE విధానంలో TLMతో కృత్యాధార బోధన, చేయడం ద్వారా, అనుభవాల ద్వారా అభ్యసనం.

👉 నేటి డిజిటల్ యుగంలో రాణించేలా ప్రాథమిక స్థాయి నుండే కంప్యూటర్ ఎడ్యుకేషన్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతుల నిర్వహణ.

👉 పాఠాలు సులభంగా అర్థమయ్యేలా బిగ్ స్క్రీన్ పై ప్రొజెక్టర్ తో డిజిటల్ తరగతులు నిర్వహణ.

👉 T-Sat&Diksha Appతో మొబైల్ ద్వారా స్వీయ అభ్యసనం.

👉 నవోదయ, గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతుల నిర్వహణ.

👉 శారీరక, మానసిక వికాసం కోసం ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ పోటీలు నిర్వహణ.

👉 నాయకత్వ లక్షణాలు, శాస్త్రీయ దృక్పథం పెంపొందించుటకు దేశ నాయకులు, మహనీయులు, శాస్త్రవేత్తల మరియు ప్రత్యేక దినోత్సవాల నిర్వహణ.

👉 నైతిక విలువలు, పఠన నైపుణ్యాలు, సృజనాత్మకత పెంపొందించడం కోసం గ్రంథాలయం నిర్వహణ.

👉 విద్యార్థుల ప్రగతి ప్రదర్శన కోసం, పాఠశాల అభివృద్ధి కోసం ప్రతినెల ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహణ.

👉 విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధి కోసం ఆరోగ్య, వ్యాయామ విద్య; కళలు, సాంస్కృతిక విద్య; పని, కంప్యూటర్ విద్య; విలువల విద్య, జీవన నైపుణ్యాల బోధన.

👉 వారానికి మూడు గుడ్లతో, సన్న బియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం.

👉 ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు పంపిణీ.

👉 మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా మెరుగుపరిచిన విశాలమైన తరగతి గదులు, గ్రీన్ బోర్డులు, డ్యూయల్ డెస్క్ లు, సరైన గాలి, వెలుతురు కోసం ప్రతి తరగతి గదికి మూడు ఫ్యాన్లు, నాలుగు ట్యూబ్ లైట్లు కలవు.

👉 మంచినీటి వసతి కలదు.

👉 బాలబాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్లు కలవు.

👉 బాలురకు హాస్టల్ వసతి కలదు.

👉 విద్యార్థులు సురక్షితంగా ఉండేందుకు పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ కలదు.

👉 ఇంగ్లీష్ మీడియంలో ఒకటి నుండి ఐదు తరగతులకు అడ్మిషన్లు ప్రారంభమైనవి.

👉 మీ పిల్లల భవిష్యత్తు మా బాధ్యత కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు బాగా ఆలోచించి మీ పిల్లలను మన ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేయాలని మనవి🤝🙏🤝

📱పూర్తి వివరాల కోసం సంప్రదించండి: 7989970120, 7981780531, 9505488934.

Govt Tr Venkatesh sir joins his younger son Rahul in his working BPS Uppununthala Govt School










ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా తాను పనిచేస్తున్న పాఠశాలలోనే తన కుమారుడిని చేర్పించిన ప్రభుత్వ ఉపాధ్యాయడు: 

గాజుల వెంకటేష్ ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. అదే పాఠశాలలో 3సం.రాల క్రితం తన పెద్ద కుమారుడు గౌతమ్ ని చేర్పించారు. ఈ రోజు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు హన్మంతు రెడ్డి సార్, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ సమక్షంలో చిన్న కుమారుడు రాహుల్ ని చేర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఈ పాఠశాల నుంచి ప్రతి సంవత్సరం విద్యార్థులు గురుకుల సీట్లు సాధిస్తున్నారు. అహ్లాదకరమైన స్వేచ్ఛ వాతావరణంలో బట్టి విధానంలో కాకుండా కృత్యాధార బోధనా పద్దతిలో అనుభవాల ద్వారా అభ్యసనం జరుగుతుంది. కంప్యూటర్ ఎడ్యుకేషన్, స్పోకెన్ ఇంగ్లీషు, ప్రొజెక్టర్ ద్వారా డిజిటల్ తరగుతులు నిర్వహిస్తున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మౌళిక సదుపాయాలను సమకూర్చారు. పాఠ్య పుస్తకాలు, దుస్తులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరడం జరిగింది. ఉపాధ్యాయులు బాలమణి మేడం, అజ్మతుల్లా సార్ పాల్గొన్నారు.

Dr B.R Ambedkar's life history books donates by Mekala Rama Chandraiah garu



BPS ఉప్పునుంతల విద్యార్థులకు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకాలను పంపిణీ చేసిన మేకల రామచంద్రయ్య:  పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కట్ట సరిత మేడం గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 5వ తరగతి విద్యార్థులు పాఠశాలతో, ఉపాధ్యాయులతో, విద్యార్థులతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సర్పంచ్ మేడం, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, దాత రామచంద్రయ్య గారు, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ లు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు పేద కుటుంబంలో జన్మించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పట్టుదలతో బాగా చదువుకొని ప్రపంచ మేధావిగా ఖ్యాతి గడించారని, రాజ్యాంగ రచన ద్వారా అందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించారని ఆయన జీవిత చరిత్ర పుస్తకం చదివి స్పూర్తి పొంది మీరు కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాలను, పెన్నులు,పెన్ను బాక్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ భాస్కర్, నిరంజన్,శేఖర్, మల్లేష్, స్వామి, పరమేశ్ రామస్వామి, తిరుపతయ్య పాల్గొన్నారు.