Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Friday, 6 June 2025

Grama Sabha at Uppununthala on the occasion of Pro Jayashankar Badi Bata programme







ఈ రోజు ఉదయం 9 గం.లకు ఉప్పునుంతల మండలం కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ కార్యదర్శి నారుమోళ్ళ వెంకటేష్ గారి ఆద్వర్యంలో గ్రామ సభ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను, ప్రతి సంవత్సరం విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలను గ్రామ ప్రజలకు ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప్పునుంతల రాజస్వ ప్రధానోపాధ్యాయులు& కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి సార్ వివరిస్తూ గత విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో మన పాఠశాల నుంచి 563 మార్కులతో ఎ.నందిని మండలంలో మొదటి ర్యాంకు సాధించిందని, 25 మంది విద్యార్థులు 500 మార్కులు పైగా సాధించారని, 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఇంటరాక్టివ్ డిజిటల్ ప్యానల్ లు, సుదీర్ఘ అనుభవం కలిగిన, విషయ నిపుణులు అయిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలియజేశారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్ లు, 2 జతల ఏకరూప దుస్తులు, రుచికరమైన మధ్యాహ్నం భోజనం అందిస్తుందన్నారు. బాలికల ప్రాథమిక పాఠశాల ఎల్.ఎఫ్.ఎల్ ప్రధానోపాధ్యాయులు బిచ్యా నాయక్ సార్, బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు భోధనోపకరణాలతో, కంప్యూటర్, ప్రొజెక్టర్, ట్యాబ్ , కృత్రిమ మేధాలతో అర్థవంతమైన కృత్యాధార భోధన చేస్తున్నామని, కంప్యూటర్ విద్యను, స్పోకెన్ ఇంగ్లీష్, గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో ప్రతి సంవత్సరం గురుకుల సీట్లు సాధిస్తున్నారని తెలియజేశారు. బడి ఈడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని గ్రామ ప్రజలను కోరడం జరిగింది. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ గారు హాజరైన వారందరితో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి తమ వంతు కృషి చేస్తామని బడిబాట ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు, యువకులు ఆలూరి వెంకటేష్ లు మాట్లాడుతూ మన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేస్తున్నారని విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలే అందుకు నిదర్శనం అన్నారు. పంచాయతీ కార్యదర్శి పాఠశాలల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వక్తి గత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను కోరారు. మూడు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Wednesday, 4 June 2025

Felicitation on Selection of Best Practices School MPPS Uppununthala Boys

బెస్ట్ ప్రాక్టీసెస్ పాఠశాలగా బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ఎంపిక: ప్రధానోపాధ్యాయులు మరియు సీనియర్ ఉపాధ్యాయుల కు సన్మానం 

 తెలంగాణ ఎస్సీఈఆర్టీ వారు బెస్ట్ ప్రాక్టీసెస్ పాఠశాలల ఎంపిక కోసం గత నెలలో ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా నుంచి మొత్తం 78 పాఠశాలల వారు దరఖాస్తు చేసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో గారి నేతృత్వంలోని కమిటీ 3 పాఠశాలలోను బెస్ట్ ప్రాక్టీసెస్ పాఠశాలగా ఎంపిక చేసి ఎస్సీఈఆర్టీ వారికి పంపించడం జరుగింది. అందులో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ఎంపిక కావడం జరిగింది.

ప్రధానోపాధ్యాయులు యం. శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో బోధనోపకరణాలతో కృత్యాధార పద్దతిలో, ఐసిటీ తో అర్థవంతమైన బోధన చేయడం, గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు వంటి వినూత్న పద్ధతుల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో చదువును అందించడంతో ఈ సంవత్సరం ఎనిమిది మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారు, గత ఏడు సంవత్సరాల్లో మొత్తం 49 మంది ఈ పాఠశాల నుంచి గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల కృషిని తెలుసుకుని దాతలు ప్రొజెక్టర్, కలర్ ప్రింటర్, కంప్యూటర్ లు, స్టడీ మెటీరియల్, స్కూల్ బ్యాగ్ లు మొదలైనవి అందించడం జరుగుతుంది. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ తన పిల్లలను ఇదే పాఠశాలలో చదివించడం. ఇవన్నీ గమనించి తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను గత ఏడు సంవత్సరాల్లో 20 నుంచి 73 కి పెంచడం జరిగింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ పాఠశాలను బెస్ట్ ప్రాక్టీసెస్ పాఠశాలగా ఎంపిక చేశారు. ఈ పాఠశాల నుంచి ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ రేపు హైదరాబాద్ లో జరిగే ఎం.ఇ.వో ల సమావేశంలో పాఠశాల అభివృద్ధి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి చేస్తున్న ఉపాధ్యాయుల కృషిని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ గారు, అకాడమిక్ మానిటరింగ్ అధికారి షఫ్రోద్దీన్ గారు, మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ గారు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి గారు, మండల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు యం. శ్రీనివాసులు మరియు సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ లను విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించి అభినందించారు.

12th state formation day of Telangana celebrations at MPPS Uppununthala Boys

 బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం:

ఈరోజు జూన్ 2న ఉదయం 8:45 ని.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో 12వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం. శ్రీనివాసులు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నిధులు, నీళ్ళు, నియామకాలలో జరుగుతున్న అన్యాయాలను తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలందరికీ వివరిస్తూ సకల జనులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేదావులు, కవులు, కళాకారులు, రచయితలు, రైతులు, అన్ని రాజకీయ పార్టీలను, నాయకులను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారు. శ్రీకాంత చారి లాంటి ఎందరో అమరవీరులు ప్రాణ త్యాగాలు చేసిన అనంతరం తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 న ఏర్పాటు కావడం జరిగింది. 12 సం.రాల స్వరాష్ట్రంలో మరింత అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదిగి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు.

Thursday, 29 May 2025

PTM conducts in the part of advance Badi Baata programme on 30th May 2025

ప్రభుత్వ బడులల్లో ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన బోధన: 

ముందస్తు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం 8 గం.లకు మర్రిపల్లి రోడ్డు కూడలి, ఉప్పునుంతలలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన, యువకుల సమక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం (పి.టి.ఎం) నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ మన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటిపడే విధంగా ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ను ఇంగ్లీష్ ల్యాబ్ ద్వారా అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ పెద్దలు అనంత రెడ్డి గారు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి గారు, మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు బట్టి విధానంలో కాకుండా బోధనోపకరణాలతో కృత్యాధార పద్దతిలో అర్థవంతమైన బోధన అందిస్తున్నారని, గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు వంటి వినూత్న పద్ధతుల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో విద్యను బోధిస్తున్నారని వివరించారు. ఈ సంవత్సరం ఎనిమిది మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారని, గత ఏడు సంవత్సరాల్లో మొత్తం 49 మంది ఈ పాఠశాల నుంచి గురుకుల పాఠశాలలకు ఎంపికవ్వడం చాలా అభినందనీయం అని ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. అదేవిధంగా ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్ లు, నోటు పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నదని వివరించారు.

పాఠశాలలో విశాల తరగతి గదుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాబట్టి మన గ్రామంలోని బడి ఈడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని పిల్లల తల్లిదండ్రులను కోరారు. అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు బొల్లె లక్ష్మయ్య గారు, గ్రామం అధ్యక్షులు పాత్కుల కురుమయ్య గారు మాట్లాడుతూ విషయ నిపుణులైన, సుదీర్ఘ అనుభవం కలిగిన ఉపాధ్యాయ బృందం అంకితభావంతో పనిచేసి గురుకుల సీట్లు సాధిస్తూ, ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ గారు తన కుమారున్ని ఇదే పాఠశాలలో చదివిస్తుండటం ఆదర్శమని, మేము కూడా ఈ సంవత్సరం నుంచి మా పిల్లలను ఇదే పాఠశాలలో చదివిస్తామని, గ్రామంలోని ప్రజలు అందరు కూడా తమ పిల్లలను ఈ ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని కోరారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప్పునుంతల ఉపాధ్యాయులు శ్యాం సుందర్ గౌడ్, శ్రీనివాసులు, విష్ణు వర్ధన్ రెడ్డి, మాజీ యం.పి.టి.సి సభ్యులు పాత్కుల సైదమ్మ రామచంద్రయ్య, శివాజీ యూత్ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆలూరి వెంకటేష్, బొల్లె పర్వతాలు, ప్రభాకర్, సుధాకర్, విద్యార్థులు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Sunday, 25 May 2025

PTM conducts in the part of advance Badi Bata on 25th May 2015

 ప్రభుత్వ బడులల్లో ఏఐ & టి.ఎల్.యం తో బోధన: 

ముందస్తు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం 8 గం.లకు దుకాణ సముదాయ కూడలి, ఉప్పునుంతలలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన, మహిళా సంఘాల సమక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం (పి.టి.ఎం) నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ మన ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరం నుంచి కృత్రిమ మేధా (AI) ఆధారంగా విద్యాబోధన నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఇంగ్లీషు మీడియంలో బట్టి విధానంలో కాకుండా బోధనోపకరణాలతో కృత్యాధార పద్దతిలో అర్థవంతమైన బోధన చేస్తున్నామని, గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు వంటి వినూత్న పద్ధతుల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో చదువును అందిస్తున్నామని వివరించారు. ఈ సంవత్సరం ఎనిమిది మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారని, గత ఏడు సంవత్సరాల్లో మొత్తం 49 మంది మన పాఠశాల నుంచి గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారని తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్ లు, నోటు పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నదని వివరించారు.

పాఠశాలలో విశాల తరగతి గదుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాబట్టి మన గ్రామంలోని బడి ఈడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని మహిళా సంఘాలను, పిల్లల తల్లిదండ్రులను కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారు మాట్లాడుతూ విషయ నిపుణులైన, సుదీర్ఘ అనుభవం కలిగిన ఉపాధ్యాయ బృందం అంకితభావంతో పనిచేసి గురుకుల సీట్లు సాధిస్తూ, ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, విద్య ద్వారానే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ గారు తన కుమారున్ని ఇదే పాఠశాలలో చదివిస్తున్నారని, కాబట్టి మన గ్రామంలోని ప్రజలు అందరు కూడా తమ పిల్లలను ఈ ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని కోరారు. అంగన్వాడీ ఉపాధ్యాయురాలు పద్మ, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Friday, 9 May 2025

PTM conducts in tha part of Advance Badi Bata programme 2025

ఉప్పునుంతలలో బడి బాట కార్యక్రమంలో భాగంగా పి.టి.ఎం నిర్వహణ:
ముందస్తు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం 8 గం.లకు తిరుమల గుడి కూడలి, ఉప్పునుంతలలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం (పి.టి.ఎం) నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ మన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, బట్టి విధానంలో కాకుండా బోధనోపకరణాలతో కృత్యాధార పద్దతిలో అర్థవంతమైన బోధన చేస్తున్నామని, గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు వంటి వినూత్న పద్ధతుల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛ పూరిత, అహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో చదువును అందిస్తున్నామని వివరించారు. ఈ సంవత్సరం ఎనిమిది మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారని, గత ఏడు సంవత్సరాల్లో మొత్తం 49 మంది మన పాఠశాల నుంచి గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారని తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్ లు, నోటు పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నదని వివరించారు.

పాఠశాలలో విశాల తరగతి గదుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాబట్టి మన గ్రామంలోని బడి ఈడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని పిల్లల తల్లిదండ్రులను కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ పెద్దలు, మండల నాయకులు అనంత రెడ్డి గారు మాట్లాడుతూ విషయ నిపుణులైన, సుదీర్ఘ అనుభవం కలిగిన ఉపాధ్యాయ బృందం అంకితభావంతో పనిచేసి గురుకుల సీట్లు సాధిస్తూ, ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, ఈ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు కాబట్టే ఉపాధ్యాయులుగా పని చేస్తున్న గాజుల వెంకటేష్ తన కుమారున్ని కూడా ఇదే పాఠశాలలో చదివించడం అందరికీ ఆదర్శమని, విద్య ద్వారానే జీవన ప్రమాణాలు మెరుగు పడుతాయని, గౌరవం లభిస్తుంది కాబట్టి మన గ్రామంలోని ప్రజలు అందరు కూడా వారి పిల్లలను మన ప్రభుత్వ బడిలోనే చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో మాజీ ఎం.పి.టి.సి పాత్కుల రామ్ చంద్రయ్య సైదమ్మ గారు, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు, బిసి నాయకులు తిరుపతయ్య గౌడ్ గారు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 22 April 2025

Annual Day Celebrations 2025 at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా వార్షిక దినోత్సవం:

ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన వార్షిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.



ఈ సమావేశానికి అతిథులుగా మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ గారు, గ్రామ పెద్దలు అనంత రెడ్డి గారు, మండల పరిషత్ అధికారి నారాయణ గారు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి గారు, ఎల్.ఎఫ్.ఎల్. హెచ్.ఎం బిచ్యనాయక్ గారు, సన్మాన దాత పాత్కుల రామ్ చంద్రయ్య గారు, జ్ఞాపికల దాత ఎదురిశెట్టి మల్లేష్ గారు పాల్గొన్నారు.

కార్యక్రమంలో ముందుగా అతిథులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్ గారు, చందన గారు, సంగీత గారు మహనీయుల చిత్ర పటాలకు పూల దండలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. అనంతరం విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో నేర్చుకున్న విషయాలు, గురుకుల సీట్లు సాధించడానికి చేసిన కృషిని, ఉపాధ్యాయులు అందించిన సహకారాన్ని, మిత్రులతో, ఉపాధ్యాయులతో వారికున్న అనుభూతులను పంచుకున్నారు. తరువాత ప్రధానోపాధ్యాయులు పాఠశాల ప్రగతి నివేదికను తెలియచేస్తూ ఈ సంవత్సరం 8 మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారని, ఇప్పటి వరకు గత ఏడు సంవత్సరాల్లో మొత్తం 48 గురుకుల సీట్లు విద్యార్థులు సాధించారని, వారికి గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, ఆంగ్ల మాధ్యమంలో 1 నుంచి 5వ తరగతి వరకు కృత్యాధార పద్దతిలో విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వివరించారు. మన ఊరి పిల్లలు అందరినీ మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని కోరారు. తర్వాత ఉపాధ్యాయులు వెంకటేష్ గారు మాట్లాడుతూ దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి పాఠశాలకు కావాల్సిన వనరులు సమకూర్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్యను అందిస్తున్నామని, నా రెండవ కుమారుడు రాహుల్ ని కూడా ఇదే పాఠశాలలో చదివిస్తున్నానని, ఇక్కడ సుదీర్ఘ అనుభవం, విషయ నిపుణులు అయిన ఉపాధ్యాయులు ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛ పూరిత వాతావరణంలో బోధనోపకరణాలతో అర్థవంతంగా బోధించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ గ్రామ విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు.

అనంతరం అతిథులు గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులు ఆలూరి అక్షర, బొల్లె తన్వి, ఎదురిశెట్టి కీర్తన, ఇప్పటి భవ్య శ్రీ, ఆలూరి పూజిత, ఎదురిశెట్టి వరుణ్ తేజ్, బొల్గం మహేందర్ గౌడ్, జిల్లెల శివ లను శాలువాతో సన్మానించి జ్ఞాపికలను అందచేశారు, అదేవిధంగా వార్షిక పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 1వ తరగతి విద్యార్థులు మధనాగుల ప్రతిభ, మేకల భాను, 2వ తరగతి విద్యార్థులు బొల్లె చక్రవర్తి, బాజ లాస్య, పొట్టల అనన్య, 3వ తరగతి విద్యార్థులు బొడ్డుపల్లి యశ్వంత్, మధనాగుల అలేఖ్య, 4వ తరగతి విద్యార్థులు ఆలూరి శ్రీజ, సదగొండ రమేష్, 5వ తరగతి విద్యార్థులు బింగి సైదులు, మధనాగుల దివ్య లకు ఉత్తమ విద్యార్థి అవార్డులుగా జ్ఞాపికలను అందచేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందించి సుమారు 50 మంది విద్యార్థులను గురుకులాలకు పంపించడం చాలా గొప్ప విషయమని, దానికి కృషి చేసిన ఉపాధ్యాయులు లను అభినందించడం జరిగింది. విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదిగి సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను, అతిథులను ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థుల విద్యా ప్రగతికి కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు.

అనంతరం నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.



ఈ కార్యక్రమంలో పాత్కుల నిరంజన్ గారు, రామలింగయ్య గారు, ఉపాధ్యాయులు కలమండల శ్రీనివాసులు గారు, వందేమాతరం ఫౌండేషన్ రజిత గారు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆలూరి వెంకటేష్ గారు, ఆలూరి పరమేశ్వర్ గారు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.