ఈ రోజు ఉదయం 11 గం.లకు రాష్ట్రీయ బాల స్వస్త కార్యక్రమంల(RBSK) లో భాగంగా డాక్టర్ మంగ, డాక్టర్ మహేశ్వర్, ఫార్మసిస్ట్ రాజు, ఏ.ఎన్,యం రేణమ్మ లు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలను సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటానికి పాలు, పండ్లు, గుడ్లు, కూరగాయలు, ఆకు కూరలు, మాంసం, చిరు ధాన్యాలు ఆహారంగా తీసుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పాఠశాల, ఇల్లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆటలు ఆడాలని తద్వారా ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో కూడా రాణిస్తారు అని తెలియజేశారు. వైద్య సిబ్బందికి ఉపాధ్యాయులు, విద్యార్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.