Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Tuesday, 18 June 2024

Digital Classes day Celebrations at MPPS Uppununthala Boys


బడిబాట కార్యక్రమంలో భాగంగా డిజిటల్ తరగతుల దినోత్సవం: 

ఈరోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా డిజిటల్ తరగతుల దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొజెక్టర్ బిగ్ స్క్రీన్ పైన ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్ డిజిటల్ తరగతులు విద్యార్థులకు ఏవిధంగా ఉపయోగపడతాయో వివరిస్తూ నూతన పాఠ్యపుస్తకాలు అన్నింటిలోనూ ప్రతి పాఠ్యాంశానికి సంబంధించిన క్యూ.ఆర్ కోడ్ లను ముద్రించడం జరిగిందని, క్యూ.ఆర్ కోడ్లను ఉపయోగించి మొబైల్ లేదా ట్యాబ్ లేదా కంప్యూటర్ లేదా ప్రొజెక్టర్ లలో ఏ విధంగా ఆ పాఠ్యాంశాల డిజిటల్ వీడియో పాటలను చూడాలో తెలియజేశారు. ఈ డిజిటల్ పాఠాలను ఉన్నత విద్యావంతులు, సుదీర్ఘ అనుభవం కలిగిన విషయ నిపుణులు తయారు చేశారని, వీటిని విద్యార్థులకు చూపించడం ద్వారా పాఠాలను సులభంగా అవగాహన చేసుకుంటారని తెలియజేశారు. మెరుగైన ఫలితాలు సాధించడం కోసం విద్యారంగంలో, బోధనలో, మూల్యాంకనంలో కూడా సాంకేతికతను, డిజిటల్ పరికరాలను ఉపయోగించుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు బాలమణి మేడం, విద్యార్థులు పాల్గొన్నారు.

Saturday, 15 June 2024

Free Textbooks, Workbooks and Uniforms distribution at MPPS Uppununthala Boys

 

విద్యార్థులకు ఏకరూప దుస్తులు మరియు పాఠ్యపుస్తకాల పంపిణీ:

ఈరోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, అభ్యాస పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ ఈ నూతన పాఠ్యపుస్తకాలు విద్యార్థుల వికాసానికి ఎంతో తోడ్పడుతాయన్నారు. వీటిని విషయ నిపుణులు, ఉన్నత విద్యావంతులు, సుదీర్ఘ అనుభవం కలిగిన వారు విద్యార్థుల స్థాయికి అనుగుణంగా, విషయాలను సులభంగా అర్థం చేసుకోవడానికి కృత్యాల రూపంలో తయారు చేయడం జరిగిందని వివరించారు. ఎఫ్.ఎల్.ఎన్ కార్యక్రమంలో భాగంగా ఈ పాఠ్యపుస్తకాలలోని విషయాలను ఏ విధంగా బోధించాలో కూడా హ్యాండ్ బుక్ లను ప్రతి ఉపాధ్యాయునికి అందించడం జరిగిందని, వీటిలో సూచించిన విధంగా ప్రతి పీరియడ్ ను బోధించాల్సి ఉంటుందని, వెంటనే ఆ పీరియడ్ లో నేర్చుకున్న విషయాన్ని అభ్యాసం చేయడానికి అభ్యాస పుస్తకంలో కృత్యాలు ఇవ్వడం జరిగిందని, 5+1 విధానంలో 5 రోజులు బోధన 6వ రోజు అసెస్మెంట్ ఉంటుంది. దీని ద్వారా విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకొని వారి స్థాయికనుగుణంగా భోధన చేస్తామన్నారు.

Thursday, 13 June 2024

Samoohika Aksharabyasam at MPPS Uppununthala Boys| బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం


బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం:

ఈరోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలతో ఉపాధ్యాయులు,విద్యార్థులు నివాళులర్పించడం జరిగింది. పాఠశాలలో ఈ సంవత్సరం నూతనంగా చేరిన విద్యార్థుల పలకలపై అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారు, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు శారద, రజిత లు అక్షరాలు దిద్దించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మాట్లాడుతూ అక్షరాల ద్వారా, చదువు ద్వారానే మన జీవితాలు బాగుపడతాయి, మనం పొందిన జ్ఞానాన్ని ఎవ్వరు దొంగిలించలేరు. జ్ఞానవంతులకు సమాజంలో గౌరవం లభిస్తుంది, అదేవిధంగా మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చి ఉపాధ్యాయులు బోధించే విషయాలను శ్రద్ధగా విని, అవగాహన చేసుకుని వాటిని నేర్చుకొని బాగా చదువుకుంటూ భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

District Collector Uday Kumar sir, IAS visits State Best Practices School MPPS Uppununthala Boys

 
విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలిస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ IAS గారు.

విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ IAS గారు.

రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ప్రాక్టీసెస్ స్కూల్ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఉందయ్ కుమార్, IAS గారు:

గతంలో పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఉండే స్థితి నుంచి ఈ రోజు 80 మంది విద్యార్థులు పెరగడానికి చేసిన కృషిని కలెక్టర్ గారు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. గురుకుల సీట్లు వచ్చే లాగా ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందని , దానితో ప్రతి సంవత్సరం గురుకుల సీట్లు సాధిస్తున్నారని, ఈ సంవత్సరం 10 సీట్లతో పాటు ఇప్పటి వరకు 40 సీట్లు సాధించారని, ఈ పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గాజుల వెంకటేష్ సార్ తన ఇద్దరి కుమారులు గౌతమ్, రాహుల్ లను ఇదే పాఠశాలలో చదివిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, గ్రామ పెద్దలు మరియు దాతల సహకారంతో ప్రొజెక్టర్, కంప్యూటర్ లు, ప్రింటర్, గురుకుల, నవోదయ స్టడీ మెటీరియల్ మొదలైనవాటిని సమకూర్చుకొని ప్రాథమిక స్థాయి నుంచే స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, డిజిటల్ తరగతులు, అబాకస్, చిల్డ్రన్ బ్యాంక్ వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలతో పాటు, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ అందరూ సమిష్టిగా, సమన్వయంతో బట్టి విధానంలో కాకుండా పాఠాలు సులభంగా అర్థమయ్యేలా బోధనోపకరణాలతో కృత్యాదార బోధన చేస్తున్నారని, అదేవిధంగా వెంకటేష్ సార్ పాఠశాలకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, అందులో విద్యార్థుల తల్లిదండ్రులు అందరి నెంబర్లను యాడ్ చేయడం ద్వారా అనునిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటూ విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేయడం జరుగుతుందని, సెలవు రోజుల్లో కూడా విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా విద్యార్థులు చేయాల్సిన కృత్యాలను, ఇంటి పనిని వాట్సాప్ ద్వారా పంపించి, విద్యార్థులు చేసి పంపించిన వాటిని వాట్సాప్ లోనే దిద్ది విద్యార్థులకు తిరిగి పంపుతూ విద్యార్థులు నిరంతరం అభ్యసనంలో నిమగ్నం అయ్యేటట్లు చూడడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలకు ఒక వెబ్సైట్ ను , యూట్యూబ్ ఛానల్ తయారు చేసి అందులో విద్యార్థుల చూపిన ప్రతిభను, వారు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను,  పాఠశాలలో జరిగిన వివిధ కార్యక్రమాలను అప్లోడ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యాశాఖ అధికారులకు, మరియు సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా పాఠశాల గురించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులు తెలుసుకొని, ఉపాధ్యాయులు కృషిని అభినందిస్తూ, పాఠశాలపై నమ్మకంతో వారి పిల్లలను ప్రైవేటు పాఠశాల నుండి తీసి మన బాలుర ప్రభుత్వ పాఠశాల ఉప్పునుంతలలో చేర్పించడం జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ వివరించారు.

అనంతరం కలెక్టర్ గారు విద్యార్థుల ప్రతిభను పరిశీలించి విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో పని చేయాలని సూచించారు. అదేవిధంగా మన ఊరు మన బడి పనుల పురోగతిని పరిశీలించడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కి మంజూరైన నిధులను ఖర్చు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రామారావు సార్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, ఉప్పునుంతల ఏఈ సందీప్ సార్, ఏం.ఐ.యస్ కోఆర్డినేటర్ తిరుపతి గారు, పత్రికా విలేకరులు మరియు జిల్లా విద్యాశాఖ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Wednesday, 12 June 2024

World Day Against Child Labour 2024 | ఘనంగా ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం


 ఘనంగా ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం:

ఈ రోజు మధ్యాహ్నం 2 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలబాలికలు అందరూ కూడా పనుల్లో చేరకుండా పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుకోవాలని పిలుపునిచ్చారు. బాలల విద్యాహక్కు, రక్షణ హక్కు, పాల్గొనే హక్కు, అభివృద్ధి హక్కులను కాపాడటం ప్రభుత్వం, సమాజంలోని వ్యక్తుల అందరి సమిష్టి బాధ్యత అని తెలియజేశారు. బాలలను పనిలో పెట్టుకోవడం నేరము. వారు శారీరకంగా మానసికంగా ఎదుగుతూ భవిష్యత్తుకు కావలసిన నైపుణ్యాలు పొందడానికి విద్యాలయాల్లో సరైన మౌళిక వసతులు అందుబాటులో ఉంచాలి. చదువు ద్వారానే జ్ఞానం, నైతిక విలువలు పొంది ఉత్తమ పౌరులుగా బాలలు తీర్చిదిద్దబడుతారు. కాబట్టి బడి ఈడు పిల్లలు అందరూ బడిలో చేరేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కృషి చేయాలన్నారు. అదేవిధంగా పాఠశాల పునః ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు స్వాగతం పలికారు. అనంతరం పాఠ్య పుస్తకాలు అందజేశారు.

Tuesday, 23 April 2024

Annual Day Celebrations 2024 at MPPS Uppununthala Boys



ఘనంగా నిర్వహించిన వార్షిక దినోత్సవం: ఈ రోజు ఉదయం 11గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన వార్షిక దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథితులుగా గ్రామ పెద్దలు కట్ట అనంత రెడ్డి గారు, పాఠశాల AAPC చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారు పాల్గొని పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలియజేశారు. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్, పద్మావతి మేడంలు ఈ సంవత్సరం పాఠశాల సాధించిన అభివృద్ధిని, విద్యార్థుల ప్రతిభను, పాఠశాలలో చేపడుతున్న వివిధ వినూత్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం దాతలు పాత్కుల సైదమ్మ రామచంద్రయ్య, EX MPTC గారు అందించిన రూ. 8000 లతో మరియు యం. నారాయణ, MPO, ఉప్పునుంతల గారు అందించిన రూ. 2000 లతో గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులు ఆడేపు మురళి, మస్కూరి అరవింద్, బొల్లె ప్రవీణ, నడిగడ్డ వరలక్ష్మి, ఆలూరి పల్లవి, పొట్టల సిరి, మేకల అక్షర లను శాలువాలతో సన్మానించి, తరగతి వారిగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉత్తమ విద్యార్థి అవార్డు మెమొంటో లతో పాటు నగదు బహుమతులను అందజేసి అభినందనలు తెలియజేశారు. విద్యార్థులకు వేసవి సెలవుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్వీయ అభ్యసనానికి తగిన సూచనలు ఇచ్చారు.

నూతనంగా ఎన్నికైన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారిని, దాత పాత్కుల సైదమ్మ రామచంద్రయ్య గారిని, గతంలో పాఠశాలకు 10 కుర్చీలను వితరణ చేసిన దాత పాత్కుల నిరంజన్ గారిని ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులు శాలువాలతో సన్మానించి వారి సేవలను కొనియాడారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింపచేశాయి.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Congratulations to students who got 5th gurukula seats in V TGCET 2024



5వ తరగతి గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందనలు: 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష 2024 ఫలితాల్లో ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా  మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల నుండి ఏడుగురు విద్యార్థులు ఆడేపు మురళి - అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో, మస్కూరి అరవింద్ - లింగాల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో, బొల్లె ప్రవీణ, నడిగడ్డ వరలక్ష్మి, ఆలూరి పల్లవి, పొట్టల సిరి లకు బాలికల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల మన్ననూర్ లో, మేకల అక్షర - వంగూర్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా ప్రార్థన సమయంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్, పద్మావతి మేడంలు విద్యార్థులను అభినందించడం జరిగింది. బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించడం జరిగింది. ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, మండల విద్యాశాఖ అధికారి రామారావు సార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్, ఎఫ్.ఎల్.ఎన్ నోడల్ అధికారి చంద్రశేఖర్ సార్ లు ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.