![]() |
బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం(పీటీఎం):
ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాలలో ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం(పీటీఎం) ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడం, నాణ్యమైన విద్యను అందించడం, తల్లిదండ్రుల బాధ్యతలు, విద్యార్థుల ప్రగతి, పూర్వ ప్రాథమిక తరగతులు, మధ్యాహ్న భోజనం తదితర అంశాల గురించి చర్చించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత, పూర్వ ప్రాథమిక తరగతి సిబ్బంది అలివేలు, రాధికలు మాట్లాడుతూ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్య, ప్రతి సంవత్సరం సాధిస్తున్న గురుకుల సీట్లు, వసతులను వివరించి విద్యార్థుల సంఖ్య 104 ను మరింతగా పెంచేలా తల్లిదండ్రులు గ్రామ ప్రజలను చైతన్యం చేయాలని కోరడం జరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, విద్యా ప్రగతి గురించి ఉపాధ్యాయులతో చర్చించడం జరిగింది. అనంతరం తల్లిదండ్రులతో బాధ్యతల వాగ్దానం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ జాకటి గీత, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.







0 comments:
Post a Comment