బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా వార్షిక దినోత్సవం:
ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన వార్షిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి అతిథులుగా మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ గారు, గ్రామ పెద్దలు అనంత రెడ్డి గారు, మండల పరిషత్ అధికారి నారాయణ గారు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి గారు, ఎల్.ఎఫ్.ఎల్. హెచ్.ఎం బిచ్యనాయక్ గారు, సన్మాన దాత పాత్కుల రామ్ చంద్రయ్య గారు, జ్ఞాపికల దాత ఎదురిశెట్టి మల్లేష్ గారు పాల్గొన్నారు.
కార్యక్రమంలో ముందుగా అతిథులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్ గారు, చందన గారు, సంగీత గారు మహనీయుల చిత్ర పటాలకు పూల దండలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. అనంతరం విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో నేర్చుకున్న విషయాలు, గురుకుల సీట్లు సాధించడానికి చేసిన కృషిని, ఉపాధ్యాయులు అందించిన సహకారాన్ని, మిత్రులతో, ఉపాధ్యాయులతో వారికున్న అనుభూతులను పంచుకున్నారు. తరువాత ప్రధానోపాధ్యాయులు పాఠశాల ప్రగతి నివేదికను తెలియచేస్తూ ఈ సంవత్సరం 8 మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారని, ఇప్పటి వరకు గత ఏడు సంవత్సరాల్లో మొత్తం 48 గురుకుల సీట్లు విద్యార్థులు సాధించారని, వారికి గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, ఆంగ్ల మాధ్యమంలో 1 నుంచి 5వ తరగతి వరకు కృత్యాధార పద్దతిలో విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వివరించారు. మన ఊరి పిల్లలు అందరినీ మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని కోరారు. తర్వాత ఉపాధ్యాయులు వెంకటేష్ గారు మాట్లాడుతూ దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి పాఠశాలకు కావాల్సిన వనరులు సమకూర్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్యను అందిస్తున్నామని, నా రెండవ కుమారుడు రాహుల్ ని కూడా ఇదే పాఠశాలలో చదివిస్తున్నానని, ఇక్కడ సుదీర్ఘ అనుభవం, విషయ నిపుణులు అయిన ఉపాధ్యాయులు ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛ పూరిత వాతావరణంలో బోధనోపకరణాలతో అర్థవంతంగా బోధించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ గ్రామ విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు.
అనంతరం అతిథులు గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులు ఆలూరి అక్షర, బొల్లె తన్వి, ఎదురిశెట్టి కీర్తన, ఇప్పటి భవ్య శ్రీ, ఆలూరి పూజిత, ఎదురిశెట్టి వరుణ్ తేజ్, బొల్గం మహేందర్ గౌడ్, జిల్లెల శివ లను శాలువాతో సన్మానించి జ్ఞాపికలను అందచేశారు, అదేవిధంగా వార్షిక పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 1వ తరగతి విద్యార్థులు మధనాగుల ప్రతిభ, మేకల భాను, 2వ తరగతి విద్యార్థులు బొల్లె చక్రవర్తి, బాజ లాస్య, పొట్టల అనన్య, 3వ తరగతి విద్యార్థులు బొడ్డుపల్లి యశ్వంత్, మధనాగుల అలేఖ్య, 4వ తరగతి విద్యార్థులు ఆలూరి శ్రీజ, సదగొండ రమేష్, 5వ తరగతి విద్యార్థులు బింగి సైదులు, మధనాగుల దివ్య లకు ఉత్తమ విద్యార్థి అవార్డులుగా జ్ఞాపికలను అందచేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందించి సుమారు 50 మంది విద్యార్థులను గురుకులాలకు పంపించడం చాలా గొప్ప విషయమని, దానికి కృషి చేసిన ఉపాధ్యాయులు లను అభినందించడం జరిగింది. విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదిగి సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను, అతిథులను ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థుల విద్యా ప్రగతికి కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు.
అనంతరం నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
ఈ కార్యక్రమంలో పాత్కుల నిరంజన్ గారు, రామలింగయ్య గారు, ఉపాధ్యాయులు కలమండల శ్రీనివాసులు గారు, వందేమాతరం ఫౌండేషన్ రజిత గారు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆలూరి వెంకటేష్ గారు, ఆలూరి పరమేశ్వర్ గారు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.