ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం - మహిళా ఉపాధ్యాయులకు సన్మానం :
బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఈ రోజు ఉదయం 10 గం.లకు భారత దేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి ఫూలే గారి 194వ జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముందుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు సావిత్రి భాయి ఫూలే గారికి పూలతో నివాళులు అర్పించారు.
అనంతరం ఆమె చేసిన సేవలు గురించి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన , సంగీత లుమాట్లాడుతూ ఎస్సీ , ఎస్టీ, బిసి మరియు మహిళలు అందరికీ విద్యను అందించడానికి 1848లో తన భర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే గారితో కలిసి మొదటి పాఠశాలను స్థాపించి 1852 వరకు మొత్తం 52 పాఠశాలల ద్వారా వేల మంది విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంతోపాటు, అన్ని రకాల వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడి, మూఢనమ్మకాలను, సామాజిక రుగ్మతలను రూపుమాపి కోట్లాది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని తెలియజేశారు. ఫూలే దంపతుల స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని గొప్ప స్థాయికి ఎదిగి సమాజాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
అనంతరం మహిళా ఉపాధ్యాయులు చందన, సంగీత లను శాలువాతో సన్మానించారు.
0 comments:
Post a Comment