బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు:
బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం 6:30 గంటలకు దేశభక్తిని చాటుతూ, రాజ్యాంగ నిర్మాతలను, స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి గీతాలు పాడుతూ విద్యార్థులు జాతీయ నాయకుల వేషాధారణలో గ్రామ వీధుల గుండా ప్రభాత భేరి నిర్వహించారు.
ఉదయం 8:30 గంటలకు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో విద్యార్థులు రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు ఇచ్చారు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, చందన మేడం, సంగీత మేడం లు రాజ్యాంగం గొప్పతనాన్ని, పౌరులు అందరూ సమానంగా ఎదగడానికి వారికి కల్పించిన హక్కులను, విధులను వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పాఠశాలలో కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ఉపాధ్యాయురాలు సంగీత మేడం మంగలికుంటపల్లి గ్రామంలో మొదటి ప్రభుత్వ ఉద్యోగిగా నిలిచారంటే వారి కృషి, వారి తల్లిదండ్రుల సహకారం, రాజ్యాంగం కల్పించిన అవకాశం అని వారిని శాలువాతో సన్మానించారు. అనంతరం ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి బహుమతులు అందచేశారు.
0 comments:
Post a Comment