Friday, 10 October 2025

Uppununthala Complex HM Srinivas Reddy sir visits MPPS Uppununthala Boys and appreciates students and teachers

విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పరిశీలించి అభినందించిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి:

ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి గారు సందర్శించారు. ఇందులో భాగంగా విద్యార్థుల అభ్యసన ఫలితాలను పరిశీలించారు. విద్యార్థుల చేత తెలుగు, ఇంగ్లీష్ చదివించారు, గణితం లోని చదుర్విద ప్రక్రియలను చేయించారు. స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలు ప్రదర్శించిన నాలుగవ తరగతి విద్యార్థులు పాత్కుల రిషిత్ కుమార్, ఆలూరి చంటి, ఐదవ తరగతి విద్యార్థి ఎదురిశెట్టి వరుణ్ తేజ్ లను అభినందించారు. స్పోకెన్ ఇంగ్లీష్ ను విద్యార్థులు చాలా సులభంగా, ధారాళంగా చెప్తున్నారని, వారికి తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ ని ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు చందన, సంగీత లను అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లక్ష్యం ఏర్పాటు చేసుకొని దాని సాధన కోసం ఏం రోజు పాఠం ఆ రోజు నేర్చుకోవాలని, నేర్చుకున్న విషయాలను నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలని, చదువుతో పాటు సహపాఠ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఉపాధ్యాయుల బోధనను, పాఠశాల రిజిస్టర్ లు, రికార్డులు, విద్యార్థులకు అందిస్తున్న రాగి జావను పరిశీలించారు.

0 comments:

Post a Comment