ఉపాధ్యాయునికిి ఘన స్వాగతం పలికి అభినందించిన ఉపాధ్యాయులు మరియువిద్యార్థులు:
బాలల ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న గాజుల వెంకటేష్ తెలంగాణ రాష్ట్రం తరపున బెస్ట్ ప్రాక్టీస్ విభాగంలో తెలంగాణ ఎస్సీఈఆర్టీ చేత ఎంపికై రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయ్ పూర్ సిసిఆర్టీ లో నూతన విద్యా విధానం 2020 లో భాగంగా బోధనను ఆసక్తిగా మార్చుటకు విద్యలో పప్పెట్రి/బొమ్మల పాత్ర అనే అంశము పైన 15 రోజుల పాటు జాతీయ విద్యా శిక్షణా కార్యక్రమానికి హాజరై అక్కడ ఉత్తమ ప్రతిభను కనబరిచి అందరి మన్ననలు పొంది విజయవంతంగా ముగించుకొని తిరిగి ఈ రోజు పాఠశాలకు రావడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ ని విద్యార్థులు మరియు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు చందన, సంగీత లు ఘనంగా పూలతో స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడుతూ 15 రోజుల పాటు పప్పెట్రీ పైన వెంకటేష్ సార్ జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని సురక్షితంగా పాఠశాలకు చేరుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. అక్కడ మీరు నేర్చుకొన్న విషయాలు పాఠశాలలో అమలు పరిచి విద్యార్థుల ప్రగతికి కృషి చేయాలని కోరారు. వెంకటేష్ మాట్లాడుతూ పప్పెట్రీ/బొమ్మలతో బోధన అభ్యసన ప్రక్రియలను చేపట్టడం ద్వారా విద్యార్థులు ఆహ్లాదకరమైన సహజసిద్ధమైన స్వేచ్ఛ పూరిత వాతావరణంలో ఆసక్తిగా, చురుకుగా పాల్గొని భయం లేకుండా బట్టీ పట్టకుండా సులభంగా విషయావగహన చేసుకొంటారని, సృజనాత్మకత, నైతిక విలువలు పెంపొందించి సర్వతోముఖాభివృద్ధి సాధిస్తారని తెలియజేశారు.







0 comments:
Post a Comment