Friday, 28 February 2025

National Science Day 2024 Celebrations at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా సైన్స్ దినోత్సవం:
ఈ రోజు ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, చందన మేడం, సంగీత మేడం లు మాట్లాడుతూ భౌతిక శాస్త్ర వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, భారత రత్న C.V రామన్ గారు రామన్ ఎఫెక్ట్ ను 1928 సం.లో ఫిబ్రవరి 28న కనుగొన్న సందర్భంగా 1987 సం నుండి ఫిబ్రవరి 28న ప్రతి సంవత్సరం మన దేశంలో విజ్ఞాన శాస్త్రం గొప్పతనాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి జాతీయ విజ్ఞాన దినోత్సవంను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రవేత్తలు చేసిన ఎన్నో ఆవిష్కరణల వల్లనే మనం సౌకర్యవంతంగా జీవిస్తున్నాం కాబట్టి విజ్ఞాన శాస్త్రం గొప్పతనాన్ని తెలుసుకొని, శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలని మూఢనమ్మకాలను నమ్మొద్దు అని తెలియజేశారు. విజ్ఞాన శాస్త్రం/సైన్స్ అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతికి సంబంధించిన జ్ఞానం అని ప్రతి విషయాన్ని ఏమిటి? ఎందుకు? ఎలా? అనే ప్రశ్నలను ఆలోచించి, పరిశోధించి వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు చేసిన ప్రయోగాలను ప్రదర్శించి వివరించారు. వారిని ఉపాధ్యాయులు అభినందించారు.

0 comments:

Post a Comment