Wednesday, 24 January 2024
National Girl Child Day 2024 celebrations at MPPS Uppununthala Boys
Tuesday, 23 January 2024
127th Birth Anniversary Celebrations of Subhas Chandra Bose at MPPS Uppununthala Boys
ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి: ఈ రోజు ఉదయం 11గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 127వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ గారు 1897 సంవత్సరంలో జనవరి 23న ఒరిస్సా రాష్ట్రంలో కటక్ పట్టణంలో జానకినాథ్ బోస్, ప్రభావతి లకు జన్మించారని, బాగా చదువుకుని 1920లో భారతీయ సివిల్ సర్వీసు లో 4వ ర్యాంకు సాధించి ఒక సంవత్సరం ఉన్నత ఉద్యోగం చేసి, బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేయడం ఇష్టం లేక రాజీనామా చేసి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీలకంగా కృషి చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ కు రెండు సార్లు అధ్యక్షుడిగా పని చేసి సాయుధ పోరాటం ద్వారానే భారత స్వాతంత్ర్యం సాధ్యమని నమ్మి దానికి కూడా రాజినామా చేసి భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసి స్వాతంత్ర్యం కోసం తన చివరి శ్వాస వరకు పోరాడారు అని వారి సేవలను విద్యార్థులకు వివరించడం జరిగింది. నేతాజీ గారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
Wednesday, 3 January 2024
National women teacher 's day celebrations at MPPS Uppununthala Boys
ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో భారత దేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి ఫూలే గారి 193వ జయంతి సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ను ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సావిత్రి భాయి ఫూలే గారి చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, శ్రీనివాసులు సార్, జానకి రామ్ సార్ లు మాట్లాడుతూ సావిత్రి భాయి ఫూలే గారు తన భర్త సహకారంతో చదువుకుని శూద్రుల కోసం, బాలికల కోసం 1848 సంవత్సరంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో బాలికలకు, శూద్రులకు చదువుకోవడానికి అవకాశం లేదు. అందుకే కొందరు సావిత్రి భాయి ఫూలే పైన పాఠశాలకు వెళ్ళే సమయంలో బురద నీళ్ళు చల్లుతూ, అవమానకరంగా మాట్లాడేవారు. అయినా పట్టు వదలకుండా 52 పాఠశాలలు ప్రారంభించి విద్య ను అందించారు. అనంతరం సత్య శోదక్ సమాజ్ ద్వారా మూఢనమ్మకాలు రూపుమాపడానికి కృషి చేశారు అని తెలిపారు. మహిళా ఉపాధ్యాయులు బాలమణి మేడం, అనిత మేడం, పద్మావతి మేడం లను శాలువాతో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సన్మానించారు.