ఘనంగా నిర్వహించిన వార్షిక దినోత్సవం: ఈ రోజు ఉదయం 11గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన వార్షిక దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథితులుగా గ్రామ పెద్దలు కట్ట అనంత రెడ్డి గారు, పాఠశాల AAPC చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారు పాల్గొని పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలియజేశారు. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్, పద్మావతి మేడంలు ఈ సంవత్సరం పాఠశాల సాధించిన అభివృద్ధిని, విద్యార్థుల ప్రతిభను, పాఠశాలలో చేపడుతున్న వివిధ వినూత్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం దాతలు పాత్కుల సైదమ్మ రామచంద్రయ్య, EX MPTC గారు అందించిన రూ. 8000 లతో మరియు యం. నారాయణ, MPO, ఉప్పునుంతల గారు అందించిన రూ. 2000 లతో గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులు ఆడేపు మురళి, మస్కూరి అరవింద్, బొల్లె ప్రవీణ, నడిగడ్డ వరలక్ష్మి, ఆలూరి పల్లవి, పొట్టల సిరి, మేకల అక్షర లను శాలువాలతో సన్మానించి, తరగతి వారిగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉత్తమ విద్యార్థి అవార్డు మెమొంటో లతో పాటు నగదు బహుమతులను అందజేసి అభినందనలు తెలియజేశారు. విద్యార్థులకు వేసవి సెలవుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్వీయ అభ్యసనానికి తగిన సూచనలు ఇచ్చారు.
నూతనంగా ఎన్నికైన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారిని, దాత పాత్కుల సైదమ్మ రామచంద్రయ్య గారిని, గతంలో పాఠశాలకు 10 కుర్చీలను వితరణ చేసిన దాత పాత్కుల నిరంజన్ గారిని ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులు శాలువాలతో సన్మానించి వారి సేవలను కొనియాడారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింపచేశాయి.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.