మాజీ రాష్ట్రపతి భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భముగా బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలోనే ఉపాధ్యాయులు, విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేశారు. ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ స్థాయి నుండి రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగిన తీరుని వివరించారు. ప్రతి వ్యక్తి గొప్ప స్థాయికి చేరడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ప్రధానమైనది అందుకే తల్లి తండ్రి తరువాతి స్థానం ఉపాధ్యాయులకే ఉంటుంది. కాబట్టి వారు చెప్పిన విషయాలను నిర్లక్ష్యం చేయకుండా పాటించాలని, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఆదర్శం గా తీసుకుని బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తరువాత తమకు నాణ్యమైన విద్యను అందించడానికి నిరంతరం కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గత విద్యా సంవత్సరం గురుకుల సీటు సాధించిన కాలూరి ప్రజ్వ, కాలూరి శ్రీహాన్, బొల్లె ప్రవీణ, బొల్లె తన్వి మిగతా విద్యార్థులు అందరూ కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.