Wednesday 3 January 2024

National women teacher 's day celebrations at MPPS Uppununthala Boys

 






ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో భారత దేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి ఫూలే గారి 193వ జయంతి సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ను ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ముందుగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సావిత్రి భాయి ఫూలే గారి చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, శ్రీనివాసులు సార్, జానకి రామ్ సార్ లు మాట్లాడుతూ సావిత్రి భాయి ఫూలే గారు తన భర్త సహకారంతో చదువుకుని శూద్రుల కోసం, బాలికల కోసం 1848 సంవత్సరంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో బాలికలకు, శూద్రులకు చదువుకోవడానికి అవకాశం లేదు. అందుకే కొందరు సావిత్రి భాయి ఫూలే పైన పాఠశాలకు వెళ్ళే సమయంలో బురద నీళ్ళు చల్లుతూ, అవమానకరంగా మాట్లాడేవారు. అయినా పట్టు వదలకుండా 52 పాఠశాలలు ప్రారంభించి విద్య ను అందించారు. అనంతరం సత్య శోదక్ సమాజ్ ద్వారా మూఢనమ్మకాలు రూపుమాపడానికి కృషి చేశారు అని తెలిపారు. మహిళా ఉపాధ్యాయులు బాలమణి మేడం, అనిత మేడం, పద్మావతి మేడం లను శాలువాతో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సన్మానించారు.

0 comments:

Post a Comment