Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Saturday 25 February 2023

Sarpanch Katta Saritha Madam inaugurates Website of PS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల పాఠశాల వెబ్సైట్ ను ప్రారంభిస్తున్న సర్పంచ్ కట్ట సరిత మేడం గారు:

ఈ రోజు ఫిబ్రవరి 25, 2023న ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల వెబ్సైట్ ను కట్ట సరిత మేడం, పెద్దలు కట్టా అనంత రెడ్డి సార్, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ హన్మంతు రెడ్డి లతో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా గౌరవనీయులు సర్పంచ్ సరిత మేడం మరియు పెద్దలు అనంత రెడ్డి సార్ మాట్లాడుతూ నేటి సాంకేతిక యుగంలో విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండే కంప్యూటర్ విద్య నేర్చుకోవడం ఎంతో అవసరం. ఇప్పటికే అన్ని రంగాల్లో టెక్నాలజీని కంప్యూటర్ లను వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో కంప్యూటర్, టెక్నాలజీ వినియోగం మరింత పెరుగుతుంది. వీటి పైన అవగాహన లేనట్లయితే ఉన్నత స్థాయికి చేరుకోవడం చాలా కష్టం. కాబట్టి పేద విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో కంప్యూటర్ విద్యను అందించడానికి ఉపాధ్యాయులు ప్రయత్నం చేయడం చాలా సంతోషం. కంప్యూటర్ ల్యాబ్ కోసం మా వంతుగా 1 కంప్యూటర్ ను ఇస్తామని, ఇంకా దాతలతో మరో 2-3 కంప్యూటర్ లను ఇప్పించే ప్రయత్నం చేసి నెల రోజుల్లో విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్ ను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. పేద పిల్లల భవిష్యత్తు కోసం సర్పంచ్ మేడం గారు సహకారం అందిస్తున్నందుకు ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు. 

స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ హన్మంతు రెడ్డి సార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను చేపడుతున్నారు అని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని సూచించారు.  

Self Government Day Celebrations at PS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహణ:

ఈ రోజు ఫిబ్రవరి 25, 2023 న  బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. కలెక్టర్ గా గౌతమ్, DEO గా వెంకటేష్, MEO గా శివకృష్ణ, HM గా భార్గవి లు ఇలా మొత్తం 25 విద్యార్థులు ఛాత్రోపాధ్యాలుగా వ్యవహరించారు. స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు చాలా అందంగా తయారయ్యి వచ్చి చాలా బాగా పాటాలు బోధించారు. గ్రామ సర్పంచ్ కట్ట సరిత మేడం గారు, పెద్దలు కట్టా అనంత రెడ్డి సార్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు హన్మంతు రెడ్డి సార్, DTF రాష్ట్ర నాయకులు రామస్వామి సార్, SMC చైర్మన్ రాములు సార్, విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి విద్యార్థుల ప్రతిభాపాటవాలను తిలకించి వారిని అభినందించి, ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మేడం మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్, విజయ్ కుమార్ సార్ లు మాట్లాడుతూ అనుభవాన్ని మించిన అభ్యసనం లేదని మీరు ఈ రోజు స్వయంగా పాఠాలు బోధించి ఆ అనుభవాన్ని, అనుభూతి పొందారు. ఛాత్రోపాధ్యాయులుగా మీకు దక్కిన గౌరవం, అనుభూతి శాశ్వతంగా పొందాలంటే విద్యార్థులు ఏ రోజు చెప్పింది ఆ రోజు శ్రద్ధగా చదువుకోవాలని నేర్చుకొన్న విషయాలను నిజ జీవితంలో ఉపయోగించుకోవాలని సూచించారు. చదువు ఒక్కటే మన పేదరికం, అజ్ఞానం నుంచి విముక్తి ఇస్తుందని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఛాత్రోపాధ్యాయుల బోధనను పరిశీలిస్తున్న సర్పంచ్ మేడం, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్

సర్పంచ్ కట్ట సరిత మేడం గారితో విద్యార్థులకు బహుమతుల ప్రదానం

DTF ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు రామస్వామి సార్ తో విద్యార్థులకు బహుమతుల ప్రదానం 

Friday 24 February 2023

Projector donates by Kunda Vedavathi, Dy E.E for digital clases

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో డిజిటల్ తరగతులు ప్రారంభం:

డిజిటల్ తరగతుల కోసం ప్రొజెక్టర్ ను తన నాన్న కీ.శే కుంద చెన్నకేశవులు గారి జ్ఞాపకార్థం వారి కూతురు కుంద వేద కుమారి,Dy.E.E, మాధవాని పల్లి గారు అందించారు.



ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మహనీయులు బుద్దుడు, అంబేద్కర్, సావిత్రి భాయి ఫూలే, సర్వే పల్లి రాధాకృష్ణ గారి ఫోటోలకు పూలతో నివాళులు అర్పించి, క్యాండిల్స్ వెలిగించిన తర్వాత ప్రొజెక్టర్ తో డిజిటల్ తరగతులను ముఖ్య అతిథులుగా హాజరైన ఉప్పునుంతల సర్పంచ్ కట్ట సరిత రెడ్డి మేడం గారు, మండల MEO రామారావు సార్ గారు, గ్రామ పెద్దలు కట్ట అనంత రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ప్రసంగిస్తూ ఇప్పుడున్న డిజిటల్ యుగంలో డిజిటల్ తరగతుల ప్రాముఖ్యత పెరిగిందని వాటిని ఉపయోగించుని విద్యార్థులు పాఠాలను సులభంగా అర్థం చేసుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా గత నాలుగు సంవత్సరాలలో 18 మంది విద్యార్థులు గురుకుల సీట్లు పొందేలా, ప్రతి సంవత్సరం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. మహనీయులు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి సహకరించేలా డిజిటల్ తరగతుల కోసం ప్రొజెక్టర్ అందించిన వేద కుమారి గారికి ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ డిజిటల్ తరగతుల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు, SMC సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, యువకులు పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రొజెక్టర్ దాతకు పాఠశాల తరపున ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో SMC ఛైర్మన్ రాములు గారు, ఉపాధ్యాయులు బాలమణి మేడం గారు, వెంకటేష్ సార్ గారు, GPS ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు నర్సింహ రెడ్డి గారు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Our PS Uppununthala Boys students gets Gurukula seats every year

Our PS Uppununthala Boys students gets Gurukula seats every year.




PS Uppununthala Boys recognised as Best Practices School by TSSCERT

 TS SCERT recognised our PS Uppununthala Boys school as Best Practices School in state level .


Thursday 23 February 2023

Spell bee competition at PS Uppununthala Boys


ఫిబ్రవరి 10,2023న మధ్యాహ్నం 2 గం.లకు BPS ఉప్పునుంతల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను 5 గ్రూపులుగా చేసి ఆంగ్ల పదాల స్పెల్లింగ్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో విజయం సాధించిన అంపటి భార్గవి గ్రూప్ సభ్యులకి పెన్నులు బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించి, అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత కోర్సులు చేసి, ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఆంగ్ల భాష పై పట్టు సాధించాలన్నారు. అందుకోసం ఆంగ్ల పదజాలం అభివృద్ధి పరుచుకోవాలని దాని కోసం స్పెల్లింగ్ క్విజ్ కాంపిటీషన్ తోడ్పడుతుందని తెలియజేశారు. విద్యార్థులు అందరూ ఆంగ్ల పాఠ్య పుస్తకాల చివరి పేజిల్లో ఉన్న కామన్ వర్డ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లను చదివి వాటి అర్థాలు తెలుసుకొని రోజూ వాటిని ఉపయోగిస్తుంటే మరిచిపోకుండా గుర్తుంచుకుంటారని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలు అన్ని ఇంగ్లీష్ మీడియంలోకి మారినందున ఇంగ్లీష్ భాష వస్తేనే మిగిలిన విషయాలు అవగాహన చేసుకుంటారు కాబట్టి విద్యార్థులు అందరూ ఆంగ్ల భాష పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

Tuesday 21 February 2023

International Mother Language Day Celebrations at PS Uppununthala Boys

 


బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం: ఈ రోజు మధ్యాహ్నం 2 గం.లకు BPS ఉప్పునుంతల ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పద్యాల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో విజయం సాధించిన ప్రజ్వ, తేజ్ కుమార్, భార్గవి లకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించి, అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ అమ్మ మనకు ఆది గురువు, అమ్మ నేర్పే భాషే మాతృభాష. పాఠశాలకు రాకముందే దీన్ని చాలా సహజసిద్ధంగా మన కుటుంబ సభ్యులను అనుకరిస్తూ నేర్చుకుంటాం. వినడం, మాట్లాడటం ఇంటి వద్దే నేర్చుకుంటే చదవడం, రాయడం వ్యాకరణ అంశాలు పాఠశాలలో నేర్చుకుంటాం. మాతృభాష మన సంస్కృతికి అనుసంధానం అయి ఉంటుంది కాబట్టి దాన్ని పరిరక్షించుకుంటూనే ఇతర భాషలను నేర్చుకోవాలి. భాషా వికాసం జరిగినప్పుడే విషయావగాహన అవుతుంది. కాబట్టి మాతృభాష పై విద్యార్థులు పట్టు సాధించాలి. అప్పుడే ఇతర భాషలపై కూడా పట్టు సాధిస్తాం. విద్యార్థులు మాతృ భాషలో పుస్తకాలు చదవాలి, కవితలు, పాటలు, గేయాలు, కథలు, నాటికలు రాయాలి, వాటిని ప్రదర్శించాలని తెలియజేశారు.

Friday 17 February 2023

General Knowledge Quiz Competition at PS Uppununthala Boys

 

ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు BPS ఉప్పునుంతల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను 5 గ్రూపులుగా చేసి జనరల్ నాలెడ్జ్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో విజయం సాధించిన మధనాగుల ప్రణవి గ్రూప్ సభ్యులకి పెన్నులు బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించి, అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ విద్యార్థులు తమ చుట్టూ ఉన్న సమాజాన్ని అవగాహన చేసుకోవడానికి జనరల్ నాలెడ్జ్ పై పట్టు సాధించాలన్నారు. సమాజాన్ని అవగాహన చేసుకుంటేనే భవిష్యత్తులో భావి భారత ఉత్తమ పౌరులుగా తయారవుతారు. దీని వల్ల భవిష్యత్తులో రాబోయే అన్ని పోటీ పరీక్షలకు కావలసిన ప్రాథమిక సమాచారం తెలుస్తోంది, ఇలాంటి క్విజ్ ల వల్ల విద్యార్థుల్లో పోటి తత్వం పెరిగి జ్ఞాన సముపార్జనకు సంసిద్ధులు అవుతారు.దానితో పాటు పుస్తక పఠనం అలవడుతుంది, విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. గ్రూప్ లలో చర్చిస్తారు కాబట్టి సహకారం అలవడుతుంది.కాబట్టి విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండే జనరల్ నాలెడ్జ్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

Monday 13 February 2023

Software Employee Emmadi Saidulu garu donates Colour Printer to PS Uppununthala boys


ఈ రోజు మధ్యాహ్నం 1గం.లకు సాఫ్ట్వేర్ ఉద్యోగి మహదేవ్ పూర్ గ్రామానికి చెందిన ఇమ్మడి సైదులు గారు తన భార్య భారతి, మిత్రుడు మహదేవ్ సమక్షంలో BPS ఉప్పునుంతల ప్రభుత్వ పాఠశాలకు 15వేల రూపాయల కలర్ ప్రింటర్ ను విరాళంగా అందజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు వారిని ఘనంగా శాలువాతో సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ విద్యార్థులకు, పాఠశాలకు ఎంతో ఉపయోగపడే కలర్ ప్రింటర్ ను విరాళంగా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.


ప్రింటర్ దాత సైదులు గారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉపాధ్యాయులు అందిస్తున్నారని, అందుకే  పే బ్యాక్ టు ది సొసైటీ లో భాగంగా పాఠశాలకు ఇప్పుడు ప్రింటర్ ఇస్తున్నానని, అతి త్వరలో  కంప్యూటర్ ల్యాబ్ కోసం ఒక కంప్యూటర్ ను తన వంతు గా ఇస్తానని తెలియజేశారు. అదేవిధంగా 15 సెట్స్ నవోదయ బుక్స్ కూడా ఇస్తానని తెలియజేశారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఎన్నో సమస్యల్ని అధిగమించి ఈ స్థాయికి చేరుకొన్నానని విద్యార్థులు కూడా ఎన్ని సమస్యలు ఉన్నా విద్యను నిర్లక్ష్యం చేయకుండా భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.


నారుమొళ్ళ మహదేవ్ P.HD స్కాలర్ గారు మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇప్పుడు జర్నలిజంలో PHD చేస్తున్నాను. ఈ పాఠశాలలో గురుకుల, నవోదయ పాఠశాలల ప్రవేశం కోసం ప్రత్యేక తరగతులు, డిజిటల్ బోధన, స్పోకెన్ ఇంగ్లీష్, టైపింగ్, కంప్యూటర్ విద్య, చిల్డ్రన్ బ్యాంకు లాంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను ఉపాధ్యాయులు చేస్తున్నారు కాబట్టి విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు.


ఈ కార్యక్రమంలో సాయిని శ్రీనివాస్ గారు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆలూరి వెంకటేష్ గారు, మధనాగుల ఆంజనేయులు గారు, అంపటి తిరుపతయ్య గారు, కాలూరి భారతి గారు,కె. రవికుమార్ గారు, పాత్కల నరేష్ గారు, బూర్సుల శీను గారు, పాత్కూల రాంప్రసాద్ గారు, మేడమోని చిన్న జంగయ్య గారు, ch. మల్లేష్ గారు తదితరులు పాల్గొన్నారు.