Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Saturday 30 December 2023

New year celebrations 2024 at MPPS Uppununthala Boys | Goodbye 2023 and Welcome 2024










2023 సంవత్సరానికి వీడ్కోలు - 2024 సంవత్సరానికి ఘనంగా స్వాగతం: ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో కేకు కోసి 2023 సంవత్సరానికి వీడ్కోలు - 2024 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సంవత్సరంలో పాఠశాలలో జరిగిన వివిధ సంఘటనలను నెమరు వేసుకోవడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ సార్, బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మాట్లాడుతూ ఈ ఒక్క రోజుకే సంతోషం పరిమితం కాకుండా అందరూ విద్యార్థులు గత సంవత్సరం చేసిన పొరపాట్ల నుంచి నేర్చుకోవాలని, ఓటములనే విజయానికి మెట్లుగా మలుచుకోవాలని, వచ్చే సంవత్సరం చెడు అలవాట్లు వదులుకుని, మంచి అలవాట్లు అలవర్చుకొని, పరిశుభ్రత పాటిస్తూ, సత్ప్రవర్తనతో, లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించడానికి కృషి చేస్తూ, బాగా చదువుకొంటూ, ఆటపాటలతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పరమేష్ గారు, స్వర్ణ గారు, అనిత గారు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Saturday 23 December 2023

Navodaya and Gurukula Schools Entrance study material distribution by Saidulu Emmadi, Soft. Emp

 






విద్యార్థులకు నవోదయ, గురుకుల స్టడీ మెటీరియల్ పంపిణీ:ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల 4వ తరగతి విద్యార్థులకు గురుకుల స్టడీ మెటీరియల్, 5వ తరగతి విద్యార్థులకు నవోదయ స్టడీ మెటీరియల్ లను మహదేవ్ పూర్ గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారు తన మాతృ మూర్తి సరస్వతమ్మ గారితో కలిసి అందజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో దాత సైదులు గారు మాట్లాడుతూ తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని ఈ స్థాయికి చేరుకున్న కాబట్టి పే బ్యాక్ టు ది సొసైటీలో భాగంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపయోగపడే ఈ స్టడీ మెటీరియల్ అందిస్తున్నాను. కాబట్టి విద్యార్థులు వీటిని ఉపయోగించుకొని నవోదయ, గురుకుల సీట్లు సాధించి భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని మీరు కూడా పేద వారికి సహాయం చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, పద్మావతి మేడంలు, విద్యార్థులు దాత సైదులు గారికి, సరస్వతమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. దాతలను శాలువాతో ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్మానించారు. కార్యక్రమంలో PHD స్కాలర్ మహదేవ్,కుర్మయ్య, పరిమేష్ పాల్గొన్నారు.

Friday 22 December 2023

National Mathematics Day celebrations 2023 | Mathematics TLM Mela

 

BPS ఉప్పునుంతల పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం నిర్వహణ:
భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి జయంతిని పురస్కరించుకుని బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఈ రోజు మధ్యాహ్నం 3గం.లకు గణిత బోధనోపకరణాల మేలా(Mathematics TLM Mela)ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ మేలాకు ముఖ్య అతిథులుగా పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్ హాజరై, గణితం అన్ని శాస్త్రాలకు తల్లి లాంటిదని గణితం ఉపయోగించకుంటే ఆ విషయంలో పరిపూర్ణత ఉండదు కాబట్టి అంతా ప్రాధాన్యత ఉన్న గణితాన్ని TLM ఉపయోగించి ఆసక్తితో నేర్చుకోవాలని, గణిత ప్రాముఖ్యతను వివరించారు. గణిత ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, పద్మావతి మేడం లు మాట్లాడుతూ అమూర్థమైన గణితాన్ని విద్యార్థులు అర్థం చేసులేక గణితం అంటే భయపడుతుంటారు. కొందరు విద్యార్థులు గణితం అర్థం చేసుకోలేక గణితం అంటే అనాసక్తి ఏర్పడి చదువు మధ్యలో ఆపేస్తుంటారు. అలాంటి గణిత భావనలను ముఖ్యంగా ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అవగాహన చేయించాలంటే బోధన అభ్యసన ప్రక్రియలో భోధనోపకరణాలు/TLM వినియోగించాలి. బట్టి విధానం కాకుండా కృత్యాధార బోధన పద్దతిలో భోధనోపకరణాలు ఉపయోగించి కృత్యాల ద్వారా, ఆటల ద్వారా, పాటల ద్వారా, చేయడం ద్వారా అభ్యసనం వల్ల విద్యార్థులు భయం లేకుండా స్వేచ్ఛగా చాలా ఆసక్తిగా కృత్యాలలో పాల్గొని, ఇష్టంగా గణిత భావనలు సులువుగా అవగాహన చేసుకుంటారు, అంతేకాకుండా వాటిని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు అని వివరించారు. సంఖ్యలను పోల్చడం, చతుర్విధ ప్రక్రియలు కూడిక, తీసివేత, గుణకారం, భాగహారంలను, ఎక్కాలు, భిన్నాలు, పొడవు, బరువు, పరిమాణం, కాలం, వివిధ ఆకారాలు, వాటి చుట్టు కొలత, వైశాల్యం లను కనుగొనడం లాంటి గణిత భావనలను TLM సహాయంతో చూస్తూ, చేస్తూ సులువుగా నేర్చుకోవచ్చు అని, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను గణితం ద్వారా పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు బాలమణి మేడం లు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ గారు 33 సం.రాల తక్కువ జీవిత కాలంలోనే గణిత శాస్త్రంలో విశేష కృషి చేసి గణిత విశ్లేషణ, సంఖ్యా సిద్దాంతం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలకు సంబంధించి 3900 సూత్రాలు కనిపెట్టి గణిత మేధావి గా ప్రశంసలు పొందారు. కాబట్టి రామానుజన్ గారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు గణితంలో, చదువులో రాణించాలని సూచించారు. ఈ గణిత మేలాలో పొరుగు పాఠశాలల HM లు విజయ్ కుమార్ సార్, నరసింహ రెడ్డి సార్, ఉపాధ్యాయులు అమీర్ పాషా సార్, భాస్కర్ సార్, CRP నరేష్ సార్ మరియు విద్యార్థులు పాల్గొని వివిధ TLMలను చూసి వాటి గురించి తెలుసుకున్నారు.