Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Thursday 30 March 2023

A student distributes pens, pencils to the students of PS Uppununthala Boys

 


Dictionaries distribution to students of PS Uppununthala Boys by their Teacher

 


ప్రభుత్వ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్ తన 34వ  పుట్టిన రోజు సందర్భంగా తన పాఠశాల విద్యార్థులకు డిక్షనరీలు, పెన్సిల్,ఎరేసర్& షార్ప్నర్ లను, అదేవిధంగా తల్లిలేని ఇద్దరు నిరుపేద విద్యార్థులకు గత విద్యా సంవత్సరం మాదిరిగానే ఇప్పుడు కూడా వారికి కావలసిన అన్ని నోటు పుస్తకాలు, పెన్నులు & పెన్సిల్ లు పంపిణీ చేయడం జరిగింది.

ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించిన సందర్భంగా విద్యార్థులు ఇంగ్లీష్ భాష పై పట్టు సాధించాలంటే డిక్షనరీ ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి విద్యార్థులు ఈ డిక్షనరీ ని సద్వినియోగం చేసుకోని ఇంగ్లీష్ భాషను సులభంగా అవగాహన చేసుకోవాలని వెంకటేష్ సార్ విద్యార్థులకు సూచించారు.

విద్యార్థులు ఎంతో సంతోషంతో పుట్టిన రోజు శుభాకాంక్షలు & కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యాయులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ఇలా విద్యార్థులతో పుట్టిన రోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Monday 6 March 2023

Requirements to PS Uppununthala Boys

Computer Lab:

నేటి సాంకేతిక యుగంలో ప్రతి రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కంప్యూటర్ వినియోగం చాలా పెరిగింది. కంప్యూటర్లను వినియోగిస్తూ తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలను పొందుతున్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలంటే ప్రాథమిక స్థాయి నుండి కంప్యూటర్ విద్యను అందించాలి. అందుకోసం విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్ అవసరం ఉంది.

ఐదు కంప్యూటర్లు : సుమారు ఒక లక్ష రూపాయలు

అట్టలతో లాప్టాప్ లు చేసుకుని టైపింగ్ ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థులు: 


Library Books:

విద్యార్థులు పుస్తకాలు చదవడం ద్వారా వారిలో పఠన నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. పదజాల అభివృద్ధి జరుగుతుంది. ఊహ శక్తి పెరిగి సృజనాత్మకంగా ఆలోచిస్తారు. నైతిక విలువలు అలబడతాయి. ఏకాగ్రత పెరిగి విషయాలను ఎక్కువ రోజులు గుర్తుంచుకుంటారు. జ్ఞాన సముపార్జన జరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. స్వీయ అభ్యసనం అలవబడుతుంది. 

పుస్తకాలు: సుమారు 20 వేల రూపాయలు

Water Filter :

తగినంత వాటర్ తాగకపోవడం వల్ల విద్యార్థుల్లో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులకు మినరల్ వాటర్ అందించుటకు వాటర్ ఫిల్టర్ అవసరం ఉంది. 

వాటర్ ఫిల్టర్: సుమారు 40 వేల రూపాయలు

Shoes :

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందాలంటే యూనిఫాం, టై, బెల్ట్ తో పాటు బూట్లు కూడా అవసరం ఇవి విద్యార్థుల్లో క్రమశిక్షణకు తోడ్పడుతాయి.

విద్యార్థుల బూట్లకు: సుమారు 30 వేల రూపాయలు

Games Material :

సుమారు 20వేల రూపాయలు

Play Ground : 

ఆటలు విద్యార్థుల్లో శారీరక, మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. దాంతోపాటు నాయకత్వ లక్షణాలను, టీమ్ స్పిరిట్ పోటీ తత్వాన్ని, గెలుపోటములను సమానంగా స్వీకరించే భావోద్వేగ సమతుల్యతను కలుగజేస్తాయి. విద్యార్థుల్లో శారీరక ఎదుగుదలకు తోడ్పడుతాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శించే నైపుణ్యాన్ని ఇస్తాయి. 

ఆట స్థలం అవసరం ఉంది. 




Software Employee Emmadi Saidulu Garu donates Navodaya Vidyalaya Books to students of PS Uppununthala Boys



5వ తరగతి విద్యార్థులకు నవోదయ స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారు:

ఈ రోజు ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారు ఐదు వేల రూపాయలతో పంపించిన నవోదయ స్టడీ మెటీరియల్ ను విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్ లు అందజేశారు. కలర్ ప్రింటర్, నవోదయ స్టడీ మెటీరియల్ లను అందించడమే కాకుండా కంప్యూటర్ ల్యాబ్ కోసం ఒక కంప్యూటర్ ను కూడా అందజేస్తానని చెప్పారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న  సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారికి ఉపాధ్యాయులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నవోదయ విద్యాలయాల్లో సెంట్రల్ సిలబస్ ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్య అందించడంతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే అన్ని కార్యక్రమాలు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ఈ పాఠశాలల్లో చదువుకున్న ఎందరో విద్యార్థులు IAS,IPS లాంటి ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఈ నవోదయ స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకొని సీటు సాధించి, భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొవాలని కోరారు.

Wednesday 1 March 2023

National Science Day Celebrations at PS Uppununthala Boys

 

ఈ రోజు ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ భౌతిక శాస్త్ర వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, భారత రత్న C.V రామన్ గారు రామన్ ఎఫెక్ట్ ను 1928 సం.లో ఫిబ్రవరి 28న కనుగొన్న సందర్భంగా 1987 సం నుండి ఫిబ్రవరి 28న ప్రతి సంవత్సరం మన దేశంలో విజ్ఞాన శాస్త్రం గొప్పతనాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి జాతీయ విజ్ఞాన దినోత్సవంను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రవేత్తలు చేసిన ఎన్నో ఆవిష్కరణల వల్లనే మనం సౌకర్యవంతంగా జీవిస్తున్నాం కాబట్టి విజ్ఞాన శాస్త్రం గొప్పతనాన్ని తెలుసుకొని, శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలని మూఢనమ్మకాలను నమ్మొద్దు అని తెలియజేశారు. విజ్ఞాన శాస్త్రం/సైన్స్ అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతికి సంబంధించిన జ్ఞానం అని ప్రతి విషయాన్ని ఏమిటి? ఎందుకు? ఎలా? అనే ప్రశ్నలను ఆలోచించి, పరిశోధించి వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. 


యాంత్రిక శక్తి, విద్యుత్ శక్తి గురించి విద్యార్థుల స్థాయిలో ప్రయోగం ద్వారా వివరించడం జరిగింది.